సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (21:37 IST)

బ్రేకప్ ఇస్తావా..? ముఖం మీద కాఫీ పోసిన చైనా యువతి

బ్రేకప్ ఇచ్చిన కారణంగా బాయ్‌ఫ్రెండ్‌కు చుక్కలు చూపించింది చైనా యువతి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఓ యువతికి తన ప్రియుడు కొద్ది రోజుల క్రితం బ్రేకప్ చెప్పాడు. ఈ క్రమంలో ఆమె అతనిపై రివేంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ యాప్ ద్వారా సదరు యువతి.. కాఫీ ఆర్డర్ చేసింది. 
 
అయితే ఆ కాఫీ తన గురించి కాదనీ.. తన మాజీ ప్రియుడి కోసమనీ అందులో ఆ యువతి పేర్కొంది. అంతేకాకుండా ఆ కాఫీని మర్యాదగా అతని చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదని.. ముఖం మీద చల్లితే సరిపోతుందని సూచించింది. ఈ క్రమంలో ఓ డెలివరీ బాయ్.. ఆ యువతి మాజీ ప్రియుడి ముందు కాఫీ కప్పుతో ప్రత్యక్షమై.. కప్పులో ఉన్న కాఫీని అతనిపై చల్లేశాడు. 
 
అనంతరం.. డెలివరీ బాయ్ ఇందులో తన తప్పేం లేదని సారీ చెబుతూ.. సదరు యువతి ఇచ్చిన ఆర్డర్ తాలూకు చీటీని అతనికి అందించి అక్కడునుంచి జంపయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.