గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (17:02 IST)

భౌగోళిక సమాచారం లీకైతే ఇక గోవిందా.. అందుకే పోకెమాన్ గేమ్ వద్దే వద్దు: చైనా

2016లో జూన్‌లో నియాంటిక్ లాబ్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) గేమ్ అయిన పోకెమాన్ గోను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ గేమ్‌కు ప్రస్తుతం విదేశాల్లో క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ

2016లో జూన్‌లో నియాంటిక్ లాబ్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) గేమ్ అయిన పోకెమాన్ గోను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ గేమ్‌కు ప్రస్తుతం విదేశాల్లో క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఏఆర్ గేమ్ అయిన పోకెమాన్‌లో థ్రిల్‌ను పెంచుతూ సదరు సంస్థ మార్పులు చేర్పులు చేసుకొస్తూనే ఉంది.

పిల్లలు, పెద్దలు వయస్సుతో సంబంధం లేకుండా ఈ గేమ్‌ను ఆడే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. దీంతో ఈ గేమ్‌ను నిషేధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ దశాల్లో పిల్లల్ని బాగా ఆకట్టుకుంటున్న.. మొబైల్ గేమ్ ప్రియుల్ని ఉర్రూతలూగిస్తున్న 'పోకెమాన్ గో'కు అనుమతి ఇవ్వబోమని చైనా ప్రకటించింది. 
 
భద్రతా కారణాల రీత్యా.. తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటే.. ఈ గేమ్‌ను నిషేధించడమే ఉత్తమ మార్గమని వెబ్ సైట్‌లో సంస్థ వెల్లడించింది. ''మొబైల్‌ ఫోన్లలో ఈ ఆట ఆడేవాళ్లు నిషేధిత ప్రదేశాల్లోకి ప్రవేశించడం, ట్రాఫిక్ సమస్యకు కారణమవ్వడం, ప్రమాదాలకు గురవడం తదితర సంఘటనలు కలవరపరుస్తున్నాయి.

దేశ భౌగోళిక సమాచారం బయటకు పొక్కే ముప్పు కూడా ఉందని'' ప్రభుత్వం పేర్కొంది. పోకెమాన్ గో వంటి ఇతర గేమ్స్‌నూ అనుమతించేది లేదని స్పష్టం చేసింది.