1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (16:15 IST)

చైనాలో పతాక స్థాయికి కరోనా పాజిటివ్ కేసులు

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ఫలితంగా ఆదివారం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. రెండేళ్లలో అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం ఆదివారం ఒక్కరోజే ఏకంగా 3393 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు పెట్టింపు అయ్యాయని తెలిపింది. 
 
దేశంలో 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌తో పాటు డెల్టా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావంతో షాంఘైలోని స్కూళ్లన్నింటినీ అధికారులు మూసివేశారు. ఈశాన్య చైనాలోని చాలా నగరాల్లో లౌక్డౌన్ విధించారు. జిలిన్ సిటీలో పాకిక్ష లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో వేలాది మంది తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. 
 
కరోనాతో పోల్చితే ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉందని, ఇందులోకూడా లక్షణాల్లేని వాళ్లే ఎక్కువగా ఉండటంతో వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.