గురువారం, 13 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (11:22 IST)

5 వేలకు దిగువకు చేరుకున్న పాజిటివ్ కేసులు - 104 మంది మృతి

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐదు వేలకు దిగువకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4184 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 104 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 44,488 పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,24,20,120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,15,459 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,79,5395,649 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.