శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశంలో ఐదువేలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐదు వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 3993 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, కరోనా వైరస్ బారినపడినవారిలో 108 మంది చనిపోయారు. అలాగే, గత 24 గంటల్లో 8055 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,24,06,150కు చేరుకుంది. 
 
ఇకపోతే, కరోనా వైరస్ రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 49,948 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే, ఇప్పటివరకు 179.13 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.