మొహాలీ టెస్టులో భారత్ విజయభేరీ - సిరీస్‌లో 1-0 ఆధిక్యం
పంజాబ్‌లోని మొహాలీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ తరపున రవీంద్ర జడేజా బ్యాట్‌తో పాటు బౌల్‌తో మెరిశాడు.
ఆల్‌రౌండర్ 175 పరుగులు చేసి, శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 574/8 పరుగులు చేసింది. అలాగే, శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 47 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూడా తీశాడు. దీంతో లంకేయులు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.
ఈ టెస్టులో లంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు చేసింది. భారత్ మాత్రం 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన లంక 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నిగ్స్ 222 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. లంక రెండో ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా ఒక్కడే 51 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు, అశ్విన్ నాలుగు, షమీ 2 వికెట్లు చొప్పున తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రవీంద్ర జడేజాకు ఇచ్చారు.