శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (10:11 IST)

రేప్‌కు యత్నం.. కరోనా వైరస్ సోకిందనీ చెప్పగానే...

చైనాలో ఓ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ యువతి తన తెలివితేటలను ప్రదర్శించింది. తనకు కరోనా వైరస్ సోకిందని చెప్పింది. అంతే.. ఆ కామాంధుడు పత్తాలేకుండా పారిపోయాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చైనాలోని జింగ్‌షాన్ అనే ప్రాంతం ఉంది. ఇది కరోనా వైరస్‌ పుట్టుకకు కేంద్రంగా ఉన్న వుహాన్ నగరానికి మూడు గంటల ప్రయాణ దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో ఓ మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన జియావో అనే వ్యక్తి అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆమె తెలివిగా వ్యవహరించింది. అతడి ముఖంపై దగ్గి.. తాను వూహాన్‌ నుంచి వచ్చానని, కరోనా సోకిందని చెప్పింది. అంతే.. జియావో అక్కడ నుంచి ప్రాణభయంతో పరుగో పరుగు. కాకపోతే వెళ్లేటప్పుడు ఆమె ఇంట్లోంచి 3080 యువాన్లు (దాదాపు రూ.30 వేలు) దోచుకెళ్లాడు ఘటనపై మహిళ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసినా.. జియావోను పట్టుకోలేకపోయారు. విచిత్రంగా అతడే తన తండ్రితోపాటు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.