సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (16:12 IST)

ఎగురుతున్న విమానంలోనే ఆ పని కానిచ్చిన జంట.. కూర్చున్న సీటులోనే రొమాన్స్.. వీడియో వైరల్

గాలిలో ఎగురుతున్న విమానంలో అందరూ చూస్తుండగానే ఓ జంట బరితెగించి.. రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే సీటులో కూర్చునే తమ పని కానిచ్చేశారు. ఇలా ఇంకితజ్ఞానం లేకుండా విమానంలో ఓ జంట చేసిన కామకలాపాన్ని.. కొందర

గాలిలో ఎగురుతున్న విమానంలో అందరూ చూస్తుండగానే ఓ జంట బరితెగించి.. రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే సీటులో కూర్చునే తమ పని కానిచ్చేశారు. ఇలా ఇంకితజ్ఞానం లేకుండా విమానంలో ఓ జంట చేసిన కామకలాపాన్ని.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఐరీష్‌కు రైనేర్ విమానం మాంచెస్టర్ నుంచి ఇబిజాకు వెళుతుండగా.. షాన్ అనే వ్యక్తి మరో యువతితో తను కూర్చున్న సీటులోనే ఆ పని కానిచ్చేశాడు. కాగా, జెనా అనే మరో యువతితో ఇతడు గత ఆరేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. అంతేగాకుండా గర్భవతి అయిన జెనాను త్వరలోనే షాన్ వివాహం చేసుకోనున్నాడు. అయితే షాన్ ఇలా మరో యువతితో శృంగారం చేస్తూ అడ్డంగా బుక్కైపోవడంతో జెనా ఎలా స్పందిస్తోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 
 
కానీ షాన్‌కు ఇదంతా మామూలేనని.. ఎంతో మంది అమ్మాయిలతో రొమాన్స్ చేశాడని అతని స్నేహితులు చెప్తున్నారు. ఈ క్రమంలో షాన్, జెనాల వివాహంపై సందిగ్ధత నెలకొంది. కానీ షాన్‌తో బరితెగించిన యువతి మాత్రం ఇదో రకమైన ల్యాప్ డ్యాన్స్ అంటూ దాట వేస్తోంది. ఈ ఘటనపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు సదరు విమానయాన సంస్థ వెల్లడించింది.