ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:06 IST)

49 మంది చిన్నారులకు వీర్యకణాలను ఇచ్చిన కిలాడీ డాక్టర్.. ఏమయ్యాడు..?

49 మంది చిన్నారులకు వీర్యకణాలకు ఇచ్చిన నెదర్లాండ్‌కు చెందిన ఓ వైద్యుడి గురించి వివరాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..  నెదర్లాండ్‌లో ఓ ఫెర్టిలిటీ సెంచర్‌ను జాన్ అనే వైద్యుడు నిర్వహిస్తున్నాడు. సంతానం కోసం ఈ ఆస్పత్రికి వందలాది మంది మహిళలు వచ్చేవారు. టెస్ట్ ట్యూబ్ ద్వారా వీర్యకణాలను గర్భాశయంలోకి పంపి.. శిశువులకు జన్మనిచ్చేలా చేసే ఈ వైద్యుడు.. కస్టమర్లకు తన వీర్యకణాలను ఇచ్చే దాతగా మారిపోయాడు. 
 
1980లో చాలామంది మహిళ ఈ వైద్యుని చేతిలో ఇలా మోసపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మహిళలకు జన్మించిన శిశువుల డీఎన్ఏ, వైద్యుడు జాన్ డీఎన్‌ఏ మ్యాచ్ కావడాన్ని గుర్తించారు. ఇలా ఆ వైద్యుడు 49 మంది చిన్నారులకు వీర్యదాతగా మారాడని నిర్ధారించారు. కానీ ఆ వైద్యుడు 2017లో వృద్ధాప్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.