గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం.. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్టు

donald trump
గత 2020లో జరిగి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన హింస, ఎన్నికల ఫలితాల్లో జోక్యం వంటి పలు ఆరోపణల కింద మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్ర, తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో పోలీసులకు  ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. దీంతో ఆయన జార్జియా జైల్ వద్ద పోలీసులు ఎదుట లొంగిపోయారు. 
 
ఇప్పటికే ఆయన స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఫాని విల్లీస్ అనుమతించారు. దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. 
 
ట్రంప్ జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిలుపై బయటకొచ్చారు. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. కొన్ని రోజుల కిందట కూడా 2020 ఎన్నికలకు సంబంధించిన కేసులోనే ట్రంప్ అరెస్టయ్యారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ గట్టిగా వాదిస్తున్నారు.