శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

joe biden
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కూడా ఒకసారి భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.. భారత్‌కు రానుండటం గమనార్హం. ఆయన నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. ఆయన పర్యటన సెప్టెంబరు 7 నుంచి 10వ తేదీ మధ్య కొనసాగుతుంది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ అధికారికంగా వెల్లడించింది. 
 
ఢిల్లీ వేదికగా జి20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఇందులో 30కి పైగా దేశాధినేతలు పాల్గొననున్నారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకరు. ఈ సమావేశాల్లో పాల్గొనే బైడెన్.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక మార్పులు, వాతావరణ మార్పులు, బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై మాట్లాడనున్నారు. అలాగే 2026లో జరిగే జీ20 సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చే అంశంపై కూడా జో బైడెన్ ప్రస్తావించనున్నారు.