ఎన్నికల్లో నేను గెలిచా, బైడెన్ మోసం చేసారు, సుప్రీంకోర్టుకెళ్తా: ట్రంప్
అమెరికా ఎన్నికల్లో తాను గెలిచానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం తెల్లవారు జామున ప్రకటించుకుని అందరికీ షాకిచ్చారు. ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతూ వుండగానే ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ట్రంప్ మాట్లాడుతూ... తన ప్రత్యర్థి జో బైడెన్, డెమొక్రాట్లు "మోసం" చేశారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయనీ, దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించారు. "మేము గెలవబోతున్నాం, వాస్తవానికి, మేము ఇప్పటికే గెలిచాము" అని ట్రంప్ తెల్లవారుజామున 2.30 గంటలకు వైట్ హౌస్ నుండి అసాధారణ ప్రసంగంలో అన్నారు.
"మేము అనేక ఇతర రాష్ట్రాల్లో గెలిచాము. మేము దానిని ప్రకటించబోతున్నాము. ఐతే మా గెలుపును అడ్డుకుంటూ ఓ మోసం అక్కడ జరిగింది. అమెరికన్ ప్రజలపై ఆ మోసం. మేము దీనిని జరగనివ్వము" అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.