శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (12:53 IST)

ఆరోగ్య బీమా వుంటేనే అడుగు పెట్టండి... బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బిల్లుపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఇకపై అమెరికాలో కాలు పెట్టాలంటే.. ఖచ్చితంగా ఆరోగ్యం బీమా ఉండితీరాల్సిందే. 
 
ఒకవేళ ఆరోగ్య బీమా లేకుండా అమెరికాలో కాలు పెట్టే వలసదారులు తప్పనిసరిగా 30 రోజుల్లోనే బీమా సౌకర్యాన్ని పొందాల్సి ఉంటుందని వైట్‌హౌస్ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. హెల్త్ కేర్ కోసం పెట్టుబడి పెట్టలేనివారికి తమ దేశంలో స్థానం లేదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
నవంబర్ 3 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్టని, చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించేవారికి ఈ ఆదేశాలు అడ్డుకాబోవని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18 వేల మంది శరణార్థులను దేశంలో నివాసం ఉండేందుకు అనుమతిస్తామని ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ రెండు నిర్ణయాలపై ఇపుడు చర్చ జరుగుతోంది.