మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (13:30 IST)

తమిళ చిత్ర పరిశ్రమకే ఎక్కువ మార్కులు వేస్తాను : హీరోయిన్ లైలా

తెలుగు వెండితెరకు పరిచయమైన అందమైన హీరోయిన్లలో ఒకరు లైలా. 'ఎగిరే పావురమా' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా నటించిన 'ఉగాది' చిత్రంలో ఆయన సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ పిమ్మట 'ఖైదీగారు', 'పెళ్లిచేసుకుందాం', 'పవిత్రప్రేమ' వంటి సినిమాలు చేసింది. అలాగే, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైంది. 
 
ఈ పరిస్థితుల్లో హాస్య నటుడు ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడింది. ఇందులో మాట్లాడుతూ, తెలుగు చిత్రపరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నేను తమిళ చిత్రపరిశ్రమకి ఎక్కువ మార్కులు ఇస్తాను. ఈ రెండు భాషల్లోను నాకు మంచి ప్రోత్సాహం లభించింది. 
 
అందువల్లనే త్వరలో ఈ రెండు భాషల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాను. తెలుగు.. తమిళ భాషల్లో రూపొందే ఒక సినిమాతో నా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో పనిచేయలేకపోయిన దర్శకులతోను కలిసి పనిచేయాలని వుంది' అని లైలా చెప్పుకొచ్చింది.