Dharma Sangrah

వజ్రాలు పొదిగిన ఎమిరేట్స్ విమానం?

Written By ఎం
Updated: శనివారం, 12 అక్టోబరు 2019 (07:55 IST)
ఎమిరేట్స్ విమానం అంగుళం కూడా ఖాళీ లేకుండా మొత్తం వజ్రాలతో నిండిపోయింది. వజ్రాల కాంతిలో విమానం మిలమిలా మెరుస్తుంటే చూడముచ్చటగా ఉంది.

ఎమిరేట్స్ అధికారిక ట్విట్టర్‌లో కనిపించిన ఈ ఫొటో నెటిజన్లకు ఓ పెద్ద పజిల్‌లా మారింది. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు అది నిజమా? అబద్ధమా? అన్న డైలమాలో పడిపోయారు. దీంతో ఈ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.

‘ఇది నిజమా?’ అని ఓ యూజర్ ప్రశ్నించగా, ‘‘మీరు భౌతికశాస్త్రాన్ని, ఏరో డైనమిక్స్‌ను కలిపి చేసిన అద్భుతమా?’’ అని మరో యూజర్ ప్రశ్నించాడు.
 
ఫొటో వైరల్ అయి చర్చకు దారితీయడంతో ఎమిరేట్స్ స్పందించింది. వజ్రాల విమానం వెనక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టింది. ‘‘నిజానికి ఈ విమానానికి వజ్రాలు పొదగలేదు. దీనిని సారా షకీల్ అనే క్రిస్టల్ ఆర్టిస్ట్ రూపొందించారు’’ అని ఎమిరేట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

ఖలీజా టైమ్స్ కథనం ప్రకారం.. సారా షకీల్ క్రిస్టల్ ఆర్టిస్ట్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 4.8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎమిరేట్స్ విమానానికి ఇలా వజ్రాలు పొదిగినట్టు రూపొందించిన సారా తన ఇన్‌స్టా ఖాతాలో మంగళవారం దానిని పోస్టు చేశారు.

ఇది కాస్తా వైరల్ కావడంతో అది ఎమిరేట్స్ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. దీంతో సారా షకీల్ అనుమతితో ఎమిరేట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments