శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:35 IST)

నిశ్చితార్థం జరిగింది.. కాబోయే భార్యతో సెల్ఫీ దిగాడు.. అంతే చంపేశారు..

నిశ్చితార్థం అయినా.. వివాహం కాకుండానే కలుసుకోవడం.. సెల్ఫీలు దిగడంతో తమ పరువు పోయిందని ఆరోపిస్తూ.. ఓ  తండ్రి తన కుమారుడిని చంపేశాడు. మరో తండ్రి తన కుమార్తెకు విషం పెట్టి హత్య చేసిన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నిశ్చితార్థం జరిగిన తర్వాత తన కాబోయే భార్య ఇంటికి వెళ్లిన యువకుడు.. ఆమెతో మాట్లాడటంతో పాటు సెల్ఫీలు దిగాడు. ఇలా చేయడం ఇస్లాం సంప్రదాయం ప్రకారం విరుద్దమని భావించిన ఆ జంట తండ్రులు.. దారుణ నిర్ణయానికి వచ్చారు. 
 
వీరిద్దరూ బంధువులే కావడంతో.. పరువు పోయిందనే కోపంతో పెళ్లికూతురికి విషం పెట్టి, పెళ్లి కొడుకును కాల్చి చంపేశారు. హడావుడిగా మృతదేహాలను ఖననం చేయించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి.. బాధితుల తండ్రులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.