పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ అధినేత, ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఓ కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లిన ఆయనను పాక్ రేంజర్లు కస్టడీకి తీసుకున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఇమ్రాన్ అరెస్టు గురించి పీటీఐ పార్టీ ఓ వీడియో విడుదల చేసింది. 'ఇమ్రాన్ సాహిబ్‌ను పోలీసులు హింసిస్తున్నారు. కొట్టారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు' అని పీటీఐ నాయకురాలు ముష్రత్ చీమా చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది.