Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కోలుకున్న వూహాన్

Written By ఎం
Updated: బుధవారం, 25 మార్చి 2020 (08:00 IST)
ప్రపంచం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టిన కరోనాతో చైనా దేశంలోని వూహాన్ నగరం కోలుకుంది. రెండు నెలల లాక్‌డౌన్ అనంతరం వూహాన్ నగరంలో బుధవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం తెల్లవారుజామున 5.25 గంటలకు వూహాన్ నగరంలో బస్సు సర్వీసులు రాకపోకలు సాగించాయి.

హుబే ప్రావిన్సులోని హాంకౌ రైల్వేస్టేషను నుంచి 9 వారాల లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటిసారి బుధవారం బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఒక్కో బస్సులో ఓ డ్రైవరుతోపాటు ప్రయాణికుల ఆరోగ్యం గురించి పరీక్షించేందుకు ఓ సేఫ్టీ సూపర్ వైజర్ ను నియమించారు. స్మార్ట్ ఫోన్ వినియోగించని ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేయాలంటే హెల్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని వూచాంగ్ రైల్వేస్టేషను నుంచి నడిపే బస్సు సేఫ్టీ సూపర్ వైజర్ జో జింజింగ్ చెప్పారు.

చైనాలో కరోనా బారిన పడి విలవిల్లాడిన వూహాన్ నగరంలో జనవరి 23 నుంచి బస్సులు, విమానాలు, రైళ్లల సర్వీసులను రద్దు చేశారు. ఒకవైపు కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ప్రపంచంలో పలు దేశాలు లాక్ డౌన్ విధిస్తుండగా, మరో వైపు కరోనా వైరస్ కు కేంద్ర స్థానమైన వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొని బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments