శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (11:50 IST)

మాలీపై బాంబుల వర్షం.. ఆరు ప్రాంతాల్లో ఉగ్రమూకల కాల్పులు

సెంట్రల్ మాలీపై ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో 50 మంది అల్ ఖైదాకు చెందిన జీహాదీలు హతమయ్యారు. బుర్కినా ఫాసో, నైగర్ సరిహద్దుల్లో వేచివున్న ప్రభుత్వ దళాలు ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు వీలును కల్పించేందుకు ఈ దాడులు జరిగిన నేపథ్యంలో.. ఆస్ట్రియాలోని వియన్నాలో కాల్పులు కలకలం రేపాయి. 
 
ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. భద్రతాదళాల చేతిలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. వియన్నాలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. 
 
ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. భారత్‌లోని ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తరహాలో ఏక కాలంలో కాల్పులకు తెగబడాలని ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుడని ఆస్ట్రియా మంత్రి కార్ల్ నెహ్‌మర్ తెలిపారు. ఊహించని ఈ ఉగ్ర దాడులతో వియన్నా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.