శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (10:38 IST)

దక్షిణకొరియాలో పెను విషాదం : ఒకేసారి 100 మందికి గుండెపోటు

Halloween stampade
సౌత్ కొరియాలో పెనువిషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘోర విషాదఘటనలో ఏకంగా వంద మందికి ఒకేసారి గుండెపోటు వచ్చింది. రాజధాని సియోల్ నగరంలో హోలోవీన్ పార్టీ జరిగింది. కరోనా ఆంక్షలు తర్వాత ఈ పార్టీని తొలిసారి నిర్వహించారు. ఈ పార్టీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇందులో ఒక్కసారిగా తొక్కిసలాట సంభవించింది. ఫలితంగా ఏకంగా 150 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో 100 మందికి వరకు గుండెపోటు కారణంగా చనిపోవడం గమనార్హం. 
 
సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పార్టీ జరిగిన ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తుంది. ఫలితంగా హాలీవీన్ వేడుక శోకసముద్రంగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇరుకైన వీధిలో పెద్ద ఎత్తున జనాలు గుంపులు గుంపులుగా రావడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. రోడ్లపై పడి ఉన్న క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు.