బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (22:01 IST)

దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు

చైనాకు తర్వాత దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకు పైగా కోవిడ్ కొత్త కేసులు నమోదైనాయి. గత ఏడాది జనవరిలో తొలి కోవిడ్ కేసు వెలుగు చూసిన తర్వాత దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 
 
తాజా కేసులతో సౌత్ కొరియాలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 76 లక్షలకు చేరుకున్నట్టు కొరియా తెలిపింది. సౌత్ కొరియాలో మంగళవారంనాడు కేవలం 24 గంటల్లో 293 మరణాలు సంభవించాయి. 
 
మరోవైపు, చైనాలోని షెంజెన్‌లో కోవిడ్ కేసులు ఒక్కసారిగా చెలరేగడంతో లక్షలాది మంది లాక్‌డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బుధవారంనాడు చైనాలో కొత్తగా 3,290 కేసులు నమోదైనాయి.