గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 అక్టోబరు 2022 (12:36 IST)

ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలు.. ఆరుగురు చిన్నారులు.. అగ్నికి ఆహుతి

అమెరికాలో ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. ఆ మృతదేహాలలో ఆరుగురు చిన్నారులు వుండటం విషాదాన్నిచ్చింది. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్‌ యారో పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ ఎనిమిది మంది సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. 
 
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించారు. అప్పుడే ఇంటి ముందు ఓ వ్యక్తి స్పృహలో లేని ఒక మహిళను ఈడ్చుకెళ్తూ కనిపించాడని చెప్పారు. 
 
మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.