గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 అక్టోబరు 2022 (11:53 IST)

మునుగోడు ఎన్నికలు.. 3రోజులు వైన్ షాపులు బంద్

wine shop
మునుగోడు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. గత కొద్దిరోజులుగా మునుగోడులో ప్రచారపర్వం హోరెత్తుతోంది. ఈ క్రమంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
 
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. 48 మందిని అరెస్టు చేశారు. మొత్తం 118 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తేదీతో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తోంది. 
 
నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులను మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు.