శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (10:35 IST)

బరువు 500 కేజీలు... 25 యేళ్లుగా మంచానికే పరిమితం...

కొంతమందిని చూస్తే మనకు జాలేస్తుంది. వయసు తక్కువే కానీ భారీ కాయంతో అవస్థలు పడుతుంటారు. నిర్ణీత స్థాయిని మించి శరీరం బరువు పెరిగితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవటమే అవుతుంది. తాజాగా ఇలాంటి సమస్యను ఈజ

కొంతమందిని చూస్తే మనకు జాలేస్తుంది. వయసు తక్కువే కానీ భారీ కాయంతో అవస్థలు పడుతుంటారు. నిర్ణీత స్థాయిని మించి శరీరం బరువు పెరిగితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవటమే అవుతుంది. తాజాగా ఇలాంటి సమస్యను ఈజిప్టుకు చెందిన ఇమాన్ అహ్మద్ అబ్దులాతి అనే మహిళ ఎదుర్కొంటుంది. ఈమె వయసు 36.. అయితే ఆమె బరువు మాత్రం 500ల కిలోలు. 
 
ప్రపంచంలోనే అత్యధిక బరువున్న మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. అధిక బరువు కారణంగా ఆమె 25 ఏళ్లుగా గడపదాటలేదు. చివరికి మంచంలోనే ఓ వైపు నుంచి మరోవైపునకు కనీసం అరంగుళం కూడా జరగలేని పరిస్థితిలో ఉంది. దినచర్యల కోసం కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు సాయం అందించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ఇమాన్ తెలిపింది. స్నానం చేయడం దగ్గర నుంచి మొదలు అన్ని పనులకు ఇమాన్‌ తన తల్లి, సోదరిమీదే ఆధారపడుతున్నారు. 
 
ఇమాన్‌ పుట్టినప్పుడు ఏకంగా అయిదుకిలోల బరువున్నారు. అయితే, శరీరావయవాలను విపరీతంగా ఉబ్బిపోయేలా చేసే ''ఎలిఫెంటాసిన్''’ వల్లనే ఆమె ఇలా కొండంత లావు పెరగడానికి మూలకారణమని కుటుంబసభ్యులు అంటున్నారు. చిన్నప్పుడు కాస్త బొద్దుగా ఉన్న ఇమాన్‌ బరువు పెద్దయ్యే సమయానికి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో స్కూలుకు కూడా వెళ్లలేకపోయేదట. 
 
ఇమాన్‌ శరీరంలో ఓ వైపంతా చచ్చుపడిపోయింది. దీంతో ఇమాన్ మంచానికే పరిమితమైపోయింది. ఇప్పటిదాకా ఇమాన్‌తో ఎలాగోలా తంటాలు పడి…నెట్టుకొచ్చిన ఆమె కుటుంబం ఇప్పుడు సాయం కోసం అర్ధిస్తూ…ప్రజల ముందుకొచ్చింది. రోజురోజుకూ బరువుపెరిగిపోతున్న ఇమాన్‌కు కనీసం ఈ స్థితిలో నైనా అత్యవసర శస్త్రచికిత్స చేయించాలని కోరుతున్నారు.