ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 9 నవంబరు 2016 (16:27 IST)

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్.... హాజరుకానున్న ప్రధాని మోడీ!

అమెరికా 45వ దేశాధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎంపికయ్యారు. ఆయన వచ్చే యేడాది జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిజానికి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలం వచ్చే యేడాది జనవరి 20వ తేదీతో

అమెరికా 45వ దేశాధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎంపికయ్యారు. ఆయన వచ్చే యేడాది జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిజానికి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలం వచ్చే యేడాది జనవరి 20వ తేదీతో ముగియనుంది. దీంతో అదే రోజున ట్రంప్ బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయించినట్టు సమాచారం. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వాషింగ్టన్ డీసీలోని 'యునైటెడ్ స్టేట్స్ కేపిటోల్' భవనంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకుముందు, అమెరికా కొత్త ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మరోవైపు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నట్టు సమాచారం. 
 
ఇదిలావుండగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మన ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు. అమెరికా 45వ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో భారత్ పై స్నేహపూర్వకమైన భావనను ఆయన వ్యక్తపరచడాన్ని మోడీ కొనియాడారు.