1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 మార్చి 2022 (13:00 IST)

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయ విద్యార్థిపై కాల్పులు, తీవ్ర గాయాలు

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయ విద్యార్థిపై జరిపిన కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ శుక్రవారం తెలిపారు. యుద్ధ సమయంలో రష్యా దళాలు జరుపుతున్న కాల్పుల సమయంలో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు ఆయన వెల్లడించారు.

 
 ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు సింగ్ ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారు. విద్యార్థులను ఉక్రెయిన్ దేశానికి పశ్చిమ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్ నుండి ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తున్నారు.
 
 
కాగా ఇప్పటికే మార్చి 1న కర్ణాటకకు చెందిన నవీన్ అనే భారతీయ వైద్య విద్యార్థి ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో తనకు, తన తోటి విద్యార్థులకు ఆహారం కొనడానికి బయటకు రాగా అతడు రష్యా దాడిలో మరణించాడు. 
వీలైనంత తక్కువ నష్టంతో ఉక్రెయిన్ నుండి విద్యార్థులను తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని సింగ్ చెప్పారు. 
 
రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబన సంగతి తెలిసిందే.