ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జులై 2022 (10:28 IST)

ఫిష్ కర్రీ టేస్ట్ చేద్దామని రెస్టారెంట్‌కు వెళ్తే...

ఫిష్ కర్రీ టేస్ట్ చేద్దామని రెస్టారెంట్ ఫుడ్‌ను టేస్ట్ చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన ఫుడ్‌లో.. ఇనుప వస్తువు కనిపించడంతో కంగుతింది.
 
ఆ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బందికి తెలియజేయగా.. వాళ్ల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఆమె మైండ్ బ్లాక్ అయింది. దీంతో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. వారం రోజులపాటు పని ఒత్తిడిని భరించిన మలేషియాకు చెందిన ఓ మహిళ.. వీకెండ్‌లో సరదాగా కాలక్షేపం చేసి రిలీఫ్ కావాలని భావించింది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న రెస్టారెంట్‌ను విజిట్ చేసింది. 
 
అనంతరం ఫిష్ కర్రీతో కూడిన భోజనాన్ని ఆమె ఆర్డర్ చేసింది. కొద్ది సమయం తర్వాత సిబ్బంది తీసుకొచ్చిన ఫుడ్‌ను తినడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో చేప తల తింటుండగా అందులో ఆమె ఇనుముతో చేసిన గాలం కనిపించింది. అది చూసి ఒక్కసారిగా ఆమె కంగుతింది. వెంటనే సిబ్బందిని పిలిచి విషయం చెప్పింది.
 
అయితే వాళ్లు దాన్ని లైట్ తీసుకోవడంతో వాదనకు దిగింది. దీంతో రెస్టారెంట్ మేనేజర్ కలజేసుకున్నాడు. ఆమెకు జరిగిన చేదు అనుభవానికి క్షమాపణ చెప్పి, బిల్లులో డిస్కౌంట్ ఇస్తామనడంతో గొడవ సద్దుమణిగింది.