అక్కడ అత్యాచారం చేసినా ఎటువంటి శిక్ష ఉండదట

Last Updated: గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:18 IST)
సాధారణంగా ఎవరైనా అత్యాచారం చేసినప్పుడు వారిని న్యాయస్థానంలో ప్రవేశపెడితే, నేరం రుజువైన పక్షంలో ఆ కోర్టు ఆ నేరస్థుడికి తగిన శిక్ష విధిస్తుంది. కానీ అత్యాచారం జరిగిందని ఖచ్చితంగా తెలిసీ నిరూపితమైనప్పటికీ న్యాయస్థానం నిందితుడిని వదిలివేయమని చెప్పిన ఘటన స్పెయిన్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే ఓ క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న ఇటలీకి చెందిన అమ్మాయిని బలవంతంగా తన కేబిన్‌లోకి తీసుకెళ్లిన బ్రిటన్ యువకుడు ఆమెపై అత్యాచారం చేసాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న సిబ్బంది ఓడ స్పెయిన్‌లో ఆగగానే అతన్ని పోలీసులకు పట్టించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి అతను అత్యాచారం చేసినట్లు నిర్ధారించుకుని, అతడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

అయితే కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి శిక్ష వేయడం కుదరదన్నాడు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ‘ఓ బ్రిటన్ యువతిపై ఇటాలియన్ యువకుడు.. పనామా దేశానికి చేరువలో అంతర్జాతీయ జలాల్లో ఈ చర్యకు పాల్పడ్డాడు. అతన్ని స్పెయిన్ చట్టాల ప్రకారం శిక్షించలేం. ఈ విషయం మా పరిధిలో లేదు’ అని వ్యాఖ్యానించారు. దాంతో అతన్ని పోలీసులు వదిలిపెట్టేశారు.దీనిపై మరింత చదవండి :