1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (13:28 IST)

ఇటలీలో వింత ఆచారం.. వారిని బోనులో వుంచి నదిలో ముంచుతారు

river dip
ఇటలీలో వింత ఆచారం ఆనవాయితీగా వస్తుంది. ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో హామిలిచ్చి అమలు చేయని రాజకీయ నేతలను చెక్కుబోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అని స్థానికులు చెప్తున్నారు. 
 
తమ తప్పును సరిదిద్దుకునేందుకే రాజకీయ నేతలకు ఇలాంటి శిక్షను విధిస్తారు. ప్రతి ఏడాది జూన్‌లో టోంకా పేరుతో వేడుకలను నిర్వహించి మరీ హామీలు అమలు చేయని నేతలకు ఈ శిక్షను అమలు చేస్తారు. తాము ఎన్నుకున్న నేతలు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించారని వారికి గుర్తు చేస్తారు. 
 
చెక్క బోనులో హామీలను అమలు పరచని నేతలను బంధించి క్రేన్ సహాయంతో నదిలో ముంచుతారు. కొద్దిసేపే ముంచినా వారికి బుద్ధి వస్తుందని ట్రెంట్ పట్టణ వాసులు నమ్ముతారు. దీనిని కోర్టు ఆఫ్ పెనింటెన్స్ గా కూడా పిలుస్తారు.