శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జులై 2020 (19:59 IST)

జపాన్‌లో వరదలు.. 44మంది మృతి..

Japan Floods
జపాన్‌లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుమామోటోలో 44 మంది మరణించారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు తోడు బలమైన గాలులు వీస్తుండటంతో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు జపాన్ అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. 
 
జపాన్‌లోని క్యుషూతోపాటు పలు నగరాలు పట్టణాల్లో భారీగా వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ వాతావరణ విభాగం తీర ప్రాంతాలైన ఫ్యుకోకా, నాగసాకి, సాగాలకు ప్రమాద హెచ్చరికలు జారీచేసింది. దీంతో అధికారులు ఆయా ఏరియాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కుమామోటో, మియాజాకి, కగోషిమా ప్రాంతాల నుంచి 2,54,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.