సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (11:50 IST)

సరిగ్గా చదవలేదని కుమారుడిని కత్తితో పొడిచిన తండ్రి

సరిగ్గా చదవలేదని ఓ తండ్రి కుమారుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే... ఓ ప్రైవేట్ జూనియర్ హైస్కూల్లో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సంపాదించాలని... కెంగో సతాకే (48) అ

సరిగ్గా చదవలేదని ఓ తండ్రి కుమారుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే... ఓ ప్రైవేట్ జూనియర్ హైస్కూల్లో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సంపాదించాలని... కెంగో సతాకే (48) అనే ఓ తండ్రి తన పన్నేండేళ్ల కుమారుడిని హెచ్చరించాడు. 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపం కట్టలు తెంచుకున్నఆ తండ్రి శరవేగంతో వంటింట్లో కత్తిని తీసుకొచ్చి కుమారుడిని పొడిచాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే కుమారుడు ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడిచారు. వైద్యుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి తండ్రిని అరెస్టు చేశారు.

కోపంలో పొరపాటున తప్పు చేశానని, మంచి స్కూల్లో సీటు వస్తే కుమారుడి జీవితం బాగుంటుందని ఆశించే అతడిని బాగా చదవాలని ఖండించానని తెలిపాడు. ఇదిలావుంటే... చదువు విషయంలో ప్రతి రోజూ ఇద్దరి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునేవని చుట్టుపక్కల వారు చెపుతున్నారు.