శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (18:52 IST)

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

kangana emargency
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "ఎమర్జెన్సీ".‌ ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించారు. 1975 ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో తెరకెక్కించారు. 
 
అయితే తాజాగా కంగనా ఈ సినిమా సరికొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. 2025 జనవరి 17గా సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే పలుమార్లు సెన్సార్ ఇబ్బందులు.. కోర్ట్ కేసుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు.