సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (23:01 IST)

జెడి వాన్స్: తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అవుతున్నాడు (video)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండవసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. తన గెలుపుకి కృషి చేసిన వారినందరినీ పేరుపేరునా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేను మొదట జేడీ వాన్స్ ను అభినందించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయనను ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ అని చెప్పగలను కనుక. జేడీ వాన్స్ సతీమణి ఉషాకి కంగ్రాచ్యులేషన్స్ అని అన్నారు. 
 
జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని వడ్లూరు. ఆమె తల్లిదండ్రులు భారతదేశం నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉషా చిలుకూరిని జేడీ వాన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.