బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (16:28 IST)

ఎలాన్ మస్క్.. నువ్వొక అద్భుతమైన వ్యక్తివి... అందుకే ఐ లవ్ వ్యూ : డోనాల్డ్ ట్రంప్

musk - trump
అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయభేరీ మోగించారు. దీంతో ఆయన రెండోసారి అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టనున్నారు. ఫలితంగా అమెరికా 47వ అధ్యక్షుడు కానున్నారు. అయితే, ఈ గెలుపు తర్వాత ట్రంప్ ప్రసంగించారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా రాజకీయాల్లో సరికొత్త స్టార్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
తన విజయంలో మస్క్‌‍దే కీలక పాత్ర అని చెప్పారు. మస్క్ వంటి జీనియస్‌లు అమెరికాకు అవసరమని, అలాంటి వారిని కాపాడుకుంటామని తెలిపారు. ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలోని పలు ప్రాంతాల్లో రెండువారాల పాటు ఎలాన్ మస్క్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మస్క్ నువ్వొక అద్బుతమైన వ్యక్తివి.. అందుకే ఐ లవ్ వ్యూ అంటూ ట్రంప్ కితాబిచ్చారు.