సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (09:33 IST)

యూఎస్ ఎన్నికల ఫలితాలు : గూగుల్ ఉద్యోగులకు కీలక సూచనలు

Sundar Pichai
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ నువ్వానేనా అన్న చందంగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ల మధ్య జరుగుతుంది. ఇలాంటి కీలక తరుణంలో గూగుల్ ఉద్యోగులకు ఆ సెర్చింజన్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక సూచనలు చేస్తూ మెయిల్ చేశారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. 
 
అమెరికా అధ్యక్ష బరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మధ్య పోటీ నువ్వానేనా అన్నరీతిలో ఉండటంతో ఆయన ఈ కీలక సూచనలు చేశారు. పైగా వీరిద్దరి మధ్య మెజార్టీ స్వల్పంగానే ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో తుది ఫలితంపై తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
 
అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ ఉండాలని సుందర్ పిచాయ్ తన మెయిల్ ద్వారా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో గూగుల్ సీఈవో వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
 
కాగా, గూగుల్‌పై గతంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అధ్యక్షుడుగా ఎన్నికైతే సెర్చ్ ఇంజన్‌పై విచారణ చేస్తామని కొంత కాలం క్రితం ట్రంప్ హెచ్చరించారు.