ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (14:29 IST)

2024లో మరిన్ని ఉద్యోగాల కోత.. సుందర్ పిచాయ్ ఫ్యాన్సీ రూట్

sundar pichai
సెర్చింజన్ గూగుల్ గత కొన్ని నెలల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. 2024లో మరిన్ని ఉద్యోగాల కోతలను చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.  పెట్టుబడి కోసం తమ సామర్థ్యాన్ని సృష్టించేందుకు తాము కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందని.. సుందర్ పిచాయ్ తెలిపారు. 
 
అయితే లేఆఫ్ అనే పదాన్ని పిచాయ్ ఉపయోగించలేదు. మొత్తానికి ఫ్యాన్సీ మార్గంలో ఉద్యోగాల కోత వుంటుందని సుందర్ పిచాయ్ చెప్పారు. గూగుల్ 2023లో పెద్ద తొలగింపు వ్యవధిని కలిగి ఉంది. అయితే 2024లో ఆ స్కేల్‌ను చేరుకోలేమని... అందుకని ప్రతి టీమ్‌ను తొలగించే ప్రమాదం ఉండదని పిచాయ్ చెప్పుకొచ్చారు.