బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (16:22 IST)

భారత్ నుంచి వీచే గాలుల వల్లే పాకిస్థాన్‌లో కాలుష్యం పెరిగిపోతుంది : పంజాబ్ మంత్రి

air pollution
భారత్‌లోని పలు రాష్ట్రాలతో పాటు పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ అధ్వాన్నంగా తయారైంది. అయితే, పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం భారతదేశం నుంచి వీచే గాలులేనని పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి మరియం ఔరంగజేబ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వితండవాదం చేశారు.  
 
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ అట్టగుస్థాయికి పడిపోయింది. ఇక్కడ ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లు నమోదైంది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఓ మీడియాతో మాట్లాడారు. లాహోర్‌లో వాయు కాలుష్యం పెరగడానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్‌కు చేరుకుని ఏక్యూఐ దారుణంగా పెరిగిందని మండిపడ్డారు. 
 
లాహోర్‌లో ఏక్యూఐ 500 పాయింట్లకు కాస్త అటూ ఇటుగా ఉందని మరియం తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదన్నారు. భారత్ నుంచి వీచే గాలిని ఆపడం కుదరదని, ఆ దేశంతో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు.