అమెరికా అధ్యక్ష ఎన్నికలు : విజయానికి అడుగు దూరంలో డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, -a మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా.. 18 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు 188 ఎలక్టోరల్ సీట్లు లభించినట్లయ్యింది.
ఇకపోతే, ఆయన ప్రత్యర్థిగా ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రస్తుతం 9 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఆమెకు ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్ రాష్ట్రాల్లోని 99 సీట్లు లభించాయి.
అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హారిస్ ఎదురీదుతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది. అదేసమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిటన్స్‌బర్గ్, ఫిలడెల్ఫియాలో ఆమె ముందున్నారు. దీంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు, పెన్సిల్వేనియాలో ఓటింగ్‌పై డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేసారు. స్విగ్ స్టేట్స్‌ల ఒకటైన ఈ రాషట్ర్లోని ఫిలిడెల్ఫియాలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇక్కడ భారీగా మోసం జరిగిందని ట్రంప్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆరోపించారు.
అయితే, తన ఆరోపణలకు సంబంధించి ట్రంప్ ఎలాంటి ఆధారాలు చూపించలేదు. మరోవైపు, ట్రంప్ ఆరోపణలపై రిబబ్లికన్ అయిన సిటీ కమిషనర్ సెథ్ బ్లూస్టీన్ స్పందించారు. ట్రంప్ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ఫిలిడెల్ఫియాలో ఓటింగ్ పూర్తి భద్రత మధ్య జరిగిందని పేర్కొన్నారు.