గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (14:44 IST)

అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుంది : డోనాల్డ్ ట్రంప్ విజయోత్సవ స్పీచ్

donald trump
అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతుందని ఆ దేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం వెలువడుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ వీడింది. అమెరికా పౌరులు ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన తీర్పునిచ్చారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు కలిగిన అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే 270 ఓట్లు ఖచ్చితంగా సాధించాల్సివుంది. ఇపుడు రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన డోనాల్డ్ ట్రంప్ 277 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు లాంఛన ప్రాయంగా మారనుంది. దీంతో ఆయన అమెరికాకు 47వ అధ్యక్షుడుగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందన్నారు. ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు ఎంతగానో శ్రమించారన్నారు. రిపబ్లికన్ పార్టీకి 300పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఎన్నికల్లో ఘన విజయం అందించిన అమెరికా పౌరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.