ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ స్లిప్ అయిన బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోమారు కిందపడ్డారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కుతుండగా ఆయన కాలు స్లిప్ అయింది. దీంతో ఆయన మెట్లపై ముందుకు ఒరిగిపోయారు. ప్రస్తుతం ఆయన యుద్ధభూమి ఉక్రెయిన్, పోలాండ్ దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనను ముగించుకుని ఆయన స్వదేశానికి బయలుదేరారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విమానంలో వెళ్లేందుకు సగం మెట్లను చిన్నగా ఎక్కారు. మధ్యలో ఒక్కసారి కాలు స్లిప్ అయింది. దీంతో ఆయన ముందుకు ఒరిగిపోయారు. చేతులతో మెట్లను పట్టుకుని నిలదొక్కుకుని లేచి యధావిధిగా ఆయన విమానం ప్రవేశం ద్వారం వద్దకు చేరుకుని అక్కడ నుంచి చెయ్యెత్తి అభివాదం చేసి లోపలికి వెళ్లిపోయారు.
అయితే, విమనం మెట్లు ఎక్కుతూ బైడెన్ జారిపడటం ఇది తొలిసారి కాదు. 2021లో జార్జియా వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ రెండుసార్లు ఇదే విధంగా తడబడినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అలాగే, 2022లో మే నెలలో ఆండ్రూ ఎయిర్ బేస్‌లో మెట్లు ఎక్కుతుండగా పట్టుకోల్పోయారు. లాస్ ఏంజెలెస్‌లో సమ్మిట్ ఆఫ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ ఇదేవిధంగా మరోమారు కిందపడ్డారు.