సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 2 ఆగస్టు 2022 (08:34 IST)

అల్ ఖైదా చీఫ్‌ను అంతమొందించాం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Al-Qaeda, Ayman al-Zawahiri
కాబూల్‌లో జరిపిన వైమానిక దాడిలో అల్-ఖైదా నాయకుడు అమాన్ అల్-జవహిరిని అమెరికా హతమార్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ప్రకటించారు. "న్యాయం జరిగింది. ఈ ఉగ్రవాద నాయకుడు ఇక లేరు" అని బైడెన్ టెలివిజన్ ప్రసంగంలో అన్నారు.

 
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి గం 7:30 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని కాబూల్ ప్రాంతంలోని ఓ రహస్య ప్రదేశంలో అల్-జవహరీ బాల్కనీలో టీ తాగుతున్నట్లు సమాచారం. ఆ సమయంలో అతి సమీపం నుంచి అమెరికా సేనలు డ్రోన్ దాడి చేసి మట్టుబెట్టాయి. కాగా ఈ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ తాలిబాన్ సర్కార్ పేర్కొంది.