బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (13:14 IST)

నాపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా : కొత్త రాష్ట్రపతి ముర్ము

murmu
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ తరుణంలో ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
 
దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. దేశ అత్యున్నత పదవికి తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 
 
ఒక ఆదివాసీ గ్రామంలో జన్మించిన తాను రాష్ట్రపతి భవన్‌కు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, దేశంలోని పేద ప్రజలందరికీ దక్కిన విజయమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ దేశంలో పేదలు కూడా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నిక ఒక నిదర్శనమని ఆమె చెప్పారు. 
 
50 యేళ్ళ స్వాతంత్ర్య వేడుకల వేల తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. 75 యేళ్ళ వేడుకల సమయంలో దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.