శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (11:49 IST)

దేశంలో మళ్లీ 16 వేలకు తగ్గిన పాజిటివ్ కేసులు

covid test
దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 20 వేల దిగువకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 16866 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 18,148గా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,50,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉంది. అలాగే, ఇప్పటివరకు 4,32,28,670 మంది కరోనా నుంచి కోలుకోగా, కరోనా మహమ్మారికి ఇప్పటివరకు 5,26,074 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా క్రియాశీల రేటు 0.34గా ఉంది.