సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జులై 2024 (08:38 IST)

అమెరికా ఎన్నికల్లో కమల్ హారిస్‌దే గెలుపు.. ది సింప్సన్ జోస్యం

kamal harris
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ గెలుపు సాధ్యమేనని తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ గెలవడం ఖాయమని "ది సింప్సన్స్‌" జోస్యం చెప్పింది. 'బార్ట్ టు ది ఫ్యూచర్' పేరుతో నిర్వహించిన ఫ్లాష్-ఫార్వర్డ్ ఎపిసోడ్‌లో "లిసా సింప్సన్" అనే పాత్ర అమెరికా తదుపరి అధ్యక్షురాలిని అంచనా వేసింది. 
 
మాట్ గ్రోనింగ్ అనే కార్టూనిస్ట్ ఫాక్స్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ కోసం ది సింప్సన్స్ అనే అమెరికన్ యానిమేటెడ్ కార్యక్రమాన్ని రూపొందించారు. రెండు దశాబ్దాల క్రితం 2000 ఏడాదిలో ప్రసారమైన ది సింప్సన్స్ ఎపిసోడ్, అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆసక్తికర అంచనాలు వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
 
ఇకపోతే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఖాయమని డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిని కమలాదేవి హ్యారిస్‌ ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థినిగా లాంఛనంగా డిక్లరేషన్‌ ఫాంపై సంతకాలు చేశారు. మరోవైపు బైడెన్‌ డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు ట్రంప్‌ విజయం నల్లేరుపై బండి నడకేనని అన్ని సర్వేలూ పేర్కొన్నాయి.