గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (14:05 IST)

జో బైడెన్‌ మెదడుకు వచ్చిన ఢోకా ఏమీలేదన్న వైట్ హౌస్ వైద్యుడు!!

joe biden
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెదడుకు వచ్చిన ఢోకా ఏమీ లేదని వైట్ హౌస్ వైద్యుడు కెవిన్ కె కానర్ వ్యాఖ్యానించారు. నిజానికి అగ్రరాజ్య అధ్యక్షుడుగా ఉన్న జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఎప్పటి నుంచే సందేహాలు ఉన్నాయి. ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు పలకడం, ఎగ్జిట్ ఒకవైపు ఉంటే మరోవైపు వెళ్లడం, భార్య అనుకుని మరో మహిళను ముద్దాడబోవడం ఇలాటి చాలా సంఘటనలు బైడెన్ ఆరోగ్యంపై అనేక సందేహాలు ఉత్పన్నమయ్యేలా చేశాయి. 
 
పైగా, ఆయన వయసు ప్రస్తుతం 81 యేళ్లు. దీంతో మతిమరుపు, అయోమయం సహజేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా... అమెరికా అధ్యక్షుడు పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి అది చాలా ప్రమాదంకరం అని విమర్శలకు అంటున్నారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ వైద్యుడు ఒకరు ఆసక్తికర అంశం వెల్లడించారు.
 
న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ పత్రికతో మాట్లాడుతూ, బైడెన్ మెదడుకు వచ్చిన ఢోకా ఏమీలేదన్నారు. ఆయన మానసిక ఆరోగ్యం దివ్యంగా ఉందని చెప్పారు. చాలామంది అంటున్నట్టుగా ఆయనకు పార్కిన్సన్ వ్యాధికి సంబంధించిన ఎలాంటి సమస్యా లేదని స్పష్ట చేశారు. పదవీకాలం ముగిసేనాటికి ఆయన ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు ఏమీ ఉండకపోవచ్చని డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. కాగా, త్వరలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి అనూహ్యంగా తప్పుకున్న విషయం తెల్సిందే.