ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (11:33 IST)

'కిడ్‌ మాయి డెత్‌ కేఫ్‌' : శవపేటికలో పడుకుంటే డ్రింక్‌ ధరలో డిస్కౌంట్‌...

జీవించివుండగానే మృత్యువు అనుభం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అంటే ప్రాణంతో ఉండగానే శవపేటికలో పడుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఆ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. అంతేకాదండోయ్... రెస్టారెంట్‌లోకి వెళ్లి కూర్చోగానే, నవ్వుతూ ఎదురొచ్చే సర్వర్లు ఉంటారు. వాళ్ల అందించే మెనూకార్డ్‌లో రకరకాల ఆహార పదార్థాలు నోరూరిస్తూ ఉంటాయి.
 
అదేసమయంలో 'శవపేటికలో జస్ట్‌ కొంచెం సేపు పడుకోండి.... మీకు డ్రింక్‌ ధరలో డిస్కౌంట్‌ ఇస్తాం' అనే రెస్టారెంట్‌ గురించి ఎక్కడైనా విన్నారా? థాయ్‌లాండ్‌లోని ఓ రెస్టారెంట్‌ దీన్ని ఆఫర్‌ చేసింది. ఈ విచిత్రమైన రెస్టారెంట్‌ పేరు 'కిడ్‌ మాయి డెత్‌ కేఫ్‌'. 
 
ఇంతకీ ఈ రెస్టారెంట్‌ మెనూకార్డ్‌ తెరవగానే డెత్‌, పెయిన్‌ఫుల్‌ అనే డ్రింక్స్‌ కూడా దర్శనమిస్తాయట. ఇంతకీ ఇలాంటి ఆఫర్‌ పెట్టడం వెనక ఓ సదుద్దేశమే ఉందట. మానవతా విలువలు కరువైపోతున్న నేటి సమాజానికి బుద్ధుడి సిద్ధాంతాలు ఎంతో అవసరమని థాయ్‌లాండ్‌కి చెందిన అధ్యాపకుడు గ్రహించాడు. మరణం ఎలా ఉంటుందో తెలిస్తే, మనిషిలో నానాటికీ పెరిగిపోతున్న కోపం, అసూయాద్వేషాలు తగ్గుతాయన్న ఆలోచన ఆయనకు వచ్చింది. 
 
ఓ శవపేటికను తయారు చేయుంచాడు. అందులో కొంచెంసేపు నిద్రపోతే చాలు, డ్రింక్‌ ధరలో డిస్కౌంట్‌ అని ప్రకటించాడు. కానీ, అసలు విషయం తెలిసి, 'వాట్‌ యాన్‌ ఐడియా' అనుకొని, ఈ ఆఫర్‌ను స్వీకరిస్తున్నారు. ఈ శవపేటికలో పడుకోగానే, హోటల్‌ సిబ్బంది దాన్ని మూసేస్తారట. ఆ అంధకారంలో నిజమైన జీవితానికి అర్థం ఏంటో తెలుస్తుందని ఆ ప్రొఫెసర్‌ అభిప్రాయం. అందుకు తగ్గట్టే దీనికి డిమాండ్‌ పెరిగి, కస్టమర్లు పోటెత్తుతున్నారని హోటల్‌ నిర్వాహకులు ఖుషీ అయిపోతున్నారు.