శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (11:48 IST)

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం-రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా నమోదు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైంది. మంగళవారం ఉదయం 7.21 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. అయితే, భూకంపంతో నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది. క్యాంప్‌బెల్‌ బేకు 235 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. 
 
అయితే, భూకంపంతో నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. సోమవారం మణిపూర్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. మొయిరాంగ్‌కు 49 కిలోమీటర్ల దూరంలో.. భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు.