మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (16:48 IST)

మాల్టా ఎయిర్‌పోర్టులో రన్ వేపై కూలిపోయిన విమానం.. ఐదుగురు మృతి

మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానమొకటి రన్‌వే పైనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. వీరంతా ఫ్రెంచ్ దేశానికి చెందిన వారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జర

మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానమొకటి రన్‌వే పైనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. వీరంతా ఫ్రెంచ్ దేశానికి చెందిన వారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. 
 
లుఖా విమానాశ్రయం నుంచి లిబియాకు బయల్దేరిన ఈ విమానం కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే దిశ మార్చుకుని రన్ వేను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. 
 
కాగా, ఈ విమానంలో యూరోపియన్ యూనియన్ బోర్డర్ ఏజెన్సీకి చెందిన అధికారులు ఉన్నట్టు భావిస్తుండగా, ఆ విమానంలో తమ సిబ్బంది ఎవరూ లేరని ఆ ఏజెన్సీ స్పష్టం చేసింది.