సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 మే 2017 (08:55 IST)

బుల్లెట్ ట్రైన్‌‌తో పాటు పరుగెత్తిన ప్రయాణికుడు.. ఎందుకో తెలుసా? ఈ వీడియో చూడండి (Video)

ఓ ప్రయాణికుడు బతుకుజీవుడా అంటూ బుల్లెట్ ట్రైన్‌తో పాటు పరుగెత్తాడు. అదీ తన ప్రాణాలు రక్షించుకునేందుకు. చివరకు బుల్లెట్ ట్రైన్ కనికరించడంతో ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అదేంటి.. బుల్లెట్ ట్రైన్

ఓ ప్రయాణికుడు బతుకుజీవుడా అంటూ బుల్లెట్ ట్రైన్‌తో పాటు పరుగెత్తాడు. అదీ తన ప్రాణాలు రక్షించుకునేందుకు. చివరకు బుల్లెట్ ట్రైన్ కనికరించడంతో ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అదేంటి.. బుల్లెట్ ట్రైన్ కనికరించడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన స్నేహితులకు వీడ్కోలు చెప్పేందుకు స్టేషన్‌కు వచ్చాడు. వారికి వీడ్కోలు చెబుతున్న ఆనందంలో డోర్ పక్కన చేతిని ఉంచాడు. ట్రైన్ డోరు మూసుకునే క్రమంలో అతని చేతి వేలు ఆ డోర్‌లో చిక్కుకుపోయింది. ఎంతగా ప్రయత్నించినా చేయిని వెనక్కి తీసుకోలేక పోయాడు. దీంతో బుల్లెట్ ట్రైన్‌తో పాటు తాను కూడా పరుగుపెట్టాడు. దీన్ని గమనించిన ఇతర ప్రయాణికులు రైలు ఆపాలంటూ కేకలు వేస్తూ... డ్రైవర్‌కు సైగలు చేశారు. 
 
అయితే, డ్రైవర్ చూశాడో లేదో తెలియదుగానీ.. బుల్లెట్ ట్రైన్ మాత్రం ఆగిపోయింది. ఎందుకంటే... బుల్లెట్ ట్రైన్ డోర్ పూర్తిగా మూసుకోని పక్షంలో ట్రైన్ దానికదే ఆగిపోయే సౌలభ్యం ఉంది. దీంతో కాసేపటికే ట్రైన్ ఆగిపోయింది. తిరిగి డోర్ తెరుచుకోవడంతో ఆయన ఎలాంటి ప్రమాదం బారిన పడకుండా క్షేమంగా బయటపడ్డాడు. దీనిని వీడియో తీసిన ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరు కూడా చూడండి.