1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (17:26 IST)

తొలి హత్య కేసులో 16 యేళ్ల శిక్ష.. జైలు నుంచి రాగానే రెండో భార్య పిల్లలను చంపేశాడు

మొదటి భార్య హత్య కేసులో 16 యేళ్ల జైలుశిక్ష పడింది. ఈ శిక్ష ముగియగానే బయటకు వచ్చి రెండో భార్యాపిల్లలను చంపేశాడు. అమెరికాలోని మిచిగాన్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

మొదటి భార్య హత్య కేసులో 16 యేళ్ల జైలుశిక్ష పడింది. ఈ శిక్ష ముగియగానే బయటకు వచ్చి రెండో భార్యాపిల్లలను చంపేశాడు. అమెరికాలోని మిచిగాన్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 1991లో జరిగిన మొదటి భార్య హత్య కేసులో జార్జి గ్రీన్ అనే ముద్దాయికి 16 యేళ్ల జైలుశిక్ష పడింది. మామూలుగా అయితే, 2002 తర్వాత పెరోల్‌పై బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 
కానీ జైల్లో అతని ప్రవర్తన కారణంగా నాలుగు సార్లు పెరోల్ దరఖాస్తులను అధికారులు అనుమతించలేదు. దీంతో పూర్తి శిక్ష, ఆపై జైల్లో చేసిన నేరాలకు అదనపు శిక్ష అనంతరం 2008లో బయటకు వచ్చి, కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2010లో ఫెయిత్ అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలుండగా, తను ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. 
 
నాలుగు వారాల క్రితం రెండో బిడ్డకు నాలుగేళ్లు వచ్చిన సందర్భంగా పార్టీ కూడా చేసుకున్నాడు. సెప్టెంబర్ 1వ తేదీన గ్రీన్‌కు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లభించింది. అంతా సుఖంగానే ఉందని భావిస్తున్నారా? కాదు. అంతకుముందే విడాకులు కావాలని కోర్టులో గ్రీన్ పిటిషన్ దాఖలు చేశాడు. బుధవారం నాడు విడాకులు కూడా లభించాయి. 
 
ఆ రోజు రాత్రి పోలీసులకు గ్రీన్ మరోసారి ఫోన్ చేశాడు. తాను తన భార్య సహా కుటుంబం మొత్తాన్ని (భార్య, నలుగురు పిల్లలు) హత్య చేశానని చెప్పాడు. పోలీసులు వచ్చే వరకూ అతను ఎక్కడికీ వెళ్లలేదు. వారు వచ్చాక తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఇల్లాలి గృహహింసే హత్యకు కారణమని తెలిపాడు.